Chandrayaan 2: చంద్రుడి ఎగువ వాతావరణంలో దట్టమైన ప్లాస్మా

చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-2.. కీలక ఆవిష్కారం చేసింది. జాబిల్లి ఎగువ వాతావరణమైన అయనోస్పియర్‌లో అధిక సాంద్రతతో కూడిన ప్లాస్మా

Updated : 09 Aug 2022 06:03 IST

దిల్లీ: చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-2.. కీలక ఆవిష్కారం చేసింది. జాబిల్లి ఎగువ వాతావరణమైన అయనోస్పియర్‌లో అధిక సాంద్రతతో కూడిన ప్లాస్మా ఉన్నట్లు కనుగొంది. అక్కడి వేక్‌ ప్రాంతంలో ఇది వెలుగు చూసింది. చంద్రుడి వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అక్కడి అయనోస్పియర్‌లో ప్లాస్మా సాంద్రత.. క్యూబిక్‌ సెంటీమీటరుకు కొన్ని వందల అయాన్ల మేర మాత్రమే ఉండొచ్చని మొదట అంచనా వేశారు. చంద్రయాన్‌-2లోని డీఎఫ్‌ఆర్‌ఎస్‌ సేకరించిన డేటా దీనిపై స్పష్టత ఇచ్చింది. వేక్‌ ప్రాంతంలోని ప్లాస్మా సాంద్రత.. చంద్రుని పగటి భాగంలో కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని