Viral news: కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడి నెట్టివేత

రైలులో ప్రయాణికులకు ఆహార పదార్థాలు సరఫరా చేసే సిబ్బందే కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు నెట్టివేశారు. యూపీలోని లలిత్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 09 Aug 2022 06:01 IST

వంటశాల బోగీ సిబ్బంది దుశ్చర్య

ఝాన్సీ: రైలులో ప్రయాణికులకు ఆహార పదార్థాలు సరఫరా చేసే సిబ్బందే కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు నెట్టివేశారు. యూపీలోని లలిత్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రవి యాదవ్‌  తన సోదరితో కలిసి రాప్తీసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణిస్తున్నాడు. రైలు జిరోలీకి వచ్చేసరికి మంచినీటి సీసా కొనుగోలుకు, పాన్‌ ఉమ్మిన విషయానికి సంబంధించి వంటశాల బోగీ సిబ్బందితో అతనికి గొడవ మొదలైంది. అనంతరం లలిత్‌పుర్‌లో రవి సోదరి దిగిపోయింది. సిబ్బంది రవిని దిగనీయలేదు. ఆ తర్వాత అతనిపై దాడిచేసి, కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని