Viral news: మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన భాజపా నేత ఇంటిపైకి బుల్డోజర్‌

మహిళపై అనుచితంగా ప్రవర్తించిన భాజపా నేతకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసింది.

Updated : 09 Aug 2022 05:59 IST

ఈనాడు, లఖ్‌నవూ: మహిళపై అనుచితంగా ప్రవర్తించిన భాజపా నేతకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్‌ చేసింది. నోయిడాలోని  గ్రాండ్‌ ఓమాక్స్‌ సొసైటీలో నివాసముంటున్న భాజపా నేత శ్రీకాంత్‌ త్యాగి సొసైటీలో అక్రమనిర్మాణాలు చేపట్టారు. సొసైటీ అనుమతి లేకుండా, తన ఇంటి ముందు మొక్కలు కూడా నాటారు. దీనిపై ప్రశ్నించిన ఓ మహిళను పరుష పదజాలంతో దూషించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు త్యాగిపై కేసు నమోదు చేశారు. త్యాగీకి మద్దతుగా నిలిచిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నోయిడా అథారిటీ బృందం రంగంలోకి దిగి సొసైటీలో త్యాగి తన ఫ్లాట్‌కు అనుబంధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్‌తో కూల్చివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని