ఉచిత ప్రవేశాలతో పెరిగిన సందర్శకులు

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విద్యార్థులు, పెద్దలు వరుస కడుతున్నారు. సందర్శకుల సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని

Published : 09 Aug 2022 06:08 IST

చారిత్రక ప్రదేశాలను మరింత మంది సందర్శించేలా చర్యలు
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

దిల్లీ: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విద్యార్థులు, పెద్దలు వరుస కడుతున్నారు. సందర్శకుల సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఉచిత ప్రవేశాల విషయాన్ని వివరించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం పీటీఐకి తెలిపారు. భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న అన్ని ప్రాచీన కట్టడాలు, స్థలాలు, ప్రదర్శన శాలల్లోకి ఈ నెల 5 నుంచి 15 వరకు భారతీయులతో పాటు విదేశీయులకు సైతం ఉచిత ప్రవేశం కల్పించిన సంగతి తెలిసిందే. ‘‘ఇప్పటివరకూ ప్రజల స్పందన బాగుంది. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు గతంలోనూ ఉచిత ప్రవేశమే. అయితే ఇప్పుడు మరింత ఎక్కువ మంది విద్యార్థులు వీటిని చూసేందుకు వస్తున్నారు. వారి తల్లిదండ్రులను కూడా తీసుకువస్తున్నారు. ఉచిత ప్రవేశాల విషయం అన్ని పాఠశాలలు, కళాశాలలకు చేరేలా వాటి యాజమాన్యాలతో మాట్లాడుతున్నాం. నేటి యువతకు ప్రపంచంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన ఉంటోంది. కానీ వారి పట్టణం, నగరం, సమీప ప్రాంతాల్లోని వారసత్వ కట్టడాలపై అవగాహన ఉండడంలేదు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని