మాజీ ఎంపీ ఉమాకాంత్‌కు జీవితఖైదు

ఉత్తరప్రదేశ్‌లో 27 ఏళ్ల కిందటి జీఆర్‌పీ కానిస్టేబుల్‌ హత్య, మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎంపీ ఉమాకాంత్‌ యాదవ్‌ సహా ఏడుగురికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

Updated : 09 Aug 2022 06:31 IST

మరో ఆరుగురు అనుచరులకు కూడా
27 ఏళ్ల నాటి హత్య కేసులో తీర్పు

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో 27 ఏళ్ల కిందటి జీఆర్‌పీ కానిస్టేబుల్‌ హత్య, మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎంపీ ఉమాకాంత్‌ యాదవ్‌ సహా ఏడుగురికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఈ మేరకు జౌన్‌పుర్‌ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి శరత్‌చంద్ర త్రిపాఠీ.. తీర్పు వెలువరించారు. ఫిబ్రవరి 1995లో ఉమాకాంత్‌ యాదవ్‌ తన డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ యాదవ్‌ను విడిపించుకునేందుకు షాగంజ్‌ జీఆర్‌పీ లాకప్‌పై అనుచరులతో కలిసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జీఆర్‌పీ కానిస్టేబుల్‌ అజయ్‌సింగ్‌ మరణించారు. మరో కానిస్టేబుల్‌ లలన్‌సింగ్‌, రైల్వే ఉద్యోగి నిర్మల్‌ వాట్సన్‌, ప్రయాణికుడు భరత్‌లాల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధించడంతోపాటు హత్య కేసులో రూ.5 లక్షలు, ఇతర కేసులో రూ.20,000 జరిమానా విధించింది. జీఆర్పీ కానిస్టేబుల్‌ రఘనాథ్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు ఉమాకాంత్‌ యాదవ్‌పైన, ఆయన అనుచరులు ఆరుగురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమాకాంత్‌ గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని