టీవీ యాంకర్‌ నవికాకుమార్‌కు ఊరట

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో టీవీ యాంకర్‌ నవికాకుమార్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా

Published : 09 Aug 2022 06:08 IST

నుపుర్‌ వ్యాఖ్యల కేసులో బలవంతపు చర్యలు వద్దన్న సుప్రీం

దిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో టీవీ యాంకర్‌ నవికాకుమార్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కొహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. తనపై విచారణ చేపట్టకుండా కేసు కొట్టివేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సహా మరికొందరికి నోటీసులు జారీచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఓ టీవీ ఛానల్‌ మే 26న నిర్వహించిన చర్చలో పాల్గొన్న నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. నుపుర్‌తో పాటు ఆ చర్చకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవికాపైనా దిల్లీ, కోల్‌కతాల్లో కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ కేసు విచారణకు రాగా, టీవీ యాంకర్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. చర్చలో పాల్గొన్న నుపుర్‌ అనూహ్యంగా చేసిన వ్యాఖ్యల తీవ్రతను గుర్తించిన నవికా.. ‘మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి’ అని చెబుతూ ఆ వేడి చల్లార్చే ప్రయత్నం చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని