న్యాయవాదులను క్రమశిక్షణలో ఉంచేందుకే జరిమానాలు

గాడి తప్పిన న్యాయవాదులను క్రమశిక్షణలో పెట్టేందుకే హైకోర్టులు జరిమానాలు విధిస్తాయని, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమమని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న ధర్మాసనం

Published : 09 Aug 2022 06:08 IST

ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం వద్దు: జస్టిస్‌ చంద్రచూడ్‌

దిల్లీ: గాడి తప్పిన న్యాయవాదులను క్రమశిక్షణలో పెట్టేందుకే హైకోర్టులు జరిమానాలు విధిస్తాయని, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమమని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న ధర్మాసనం సోమవారం పేర్కొంది. రాజస్థాన్‌ హైకోర్టు తనకు విధించిన రూ.50 వేల జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులపై కొందరు న్యాయవాదులు నిరాధారమైన ఆరోపణలు చేస్తారని, దీనికి అడ్డుకట్ట వేసి కోర్టు గదుల్లో క్రమశిక్షణ నెలకొల్పడానికే హైకోర్టులు జరిమానాలు వేస్తాయని తెలిపింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే కోర్టు గదుల్లో క్రమశిక్షణపై హైకోర్టులు నియంత్రణ కోల్పోతాయి’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని