మరో ‘క్విట్‌ ఇండియా’ కావాలి

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన విజయమో, వీర స్వర్గమో(డు ఆర్‌ డై) అన్న పిలుపునకు స్పందించి లక్షల మంది భారతీయులు వీధుల్లోకి వచ్చి బ్రిటిష్‌వారికి ఎదురుతిరిగారు. అదే తెల్లదొరల పాలనకు చరమ గీతం పాడింది. ఇప్పుడు

Published : 09 Aug 2022 06:08 IST

రాహుల్‌ గాంధీ

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన విజయమో, వీర స్వర్గమో(డు ఆర్‌ డై) అన్న పిలుపునకు స్పందించి లక్షల మంది భారతీయులు వీధుల్లోకి వచ్చి బ్రిటిష్‌వారికి ఎదురుతిరిగారు. అదే తెల్లదొరల పాలనకు చరమ గీతం పాడింది. ఇప్పుడు కూడా దేశాన్ని నియంతృత్వ ప్రభుత్వం నుంచి కాపాడటానికి మరో ‘డు ఆర్‌ డై’ ఉద్యమం కావాలి. నియంతృత్వం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశాన్ని విడిచిపెట్టాలి.


అయోధ్యలో భాజపా భూకుంభకోణం

కాంగ్రెస్‌

రామజన్మస్థలమైన అయోధ్యలో భాజపా నేతలు భూకుంభకోణానికి తెరలేపారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నగర మేయర్‌, పలువురు అధికారులు అక్రమంగా ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు అయోధ్య అభివృద్ధి ప్రాధికార సంస్థ వెల్లడించింది. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకోవాలి.     


ఆ గుణంతోనే ఉన్నత భవిష్యత్తు

దలైలామా

తాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ భవిష్యత్తు వర్తమానంపై ఆధారపడి ఉంటుంది. దాన్ని ఉన్నతంగా మలచుకునే అవకాశం మనకు ఉంది. అది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమో, లెక్కకు మిక్కిలి ఖర్చు చేయడమో కాదు. ఇతరుల శ్రేయస్సు గురించి పరితపించే గుణాన్ని పెంపొందించుకోవడం. 


రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఘటన

పి.చిదంబరం

ధ్యప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మహిళల స్థానంలో వారి భర్తలు ప్రమాణ స్వీకారం చేయడం విషాదకరం. దేశం 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న తరుణంలోనూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఇలాంటి సంఘటనలు చేటుచేసుకుంటుండటం నమ్మశక్యం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని