అల్పసంఖ్యాకులను జిల్లా స్థాయిలో గుర్తించాలని ఆదేశాల్విలేం

అల్పసంఖ్యాకులను రాష్ట్రస్థాయిలో గుర్తించే విధానం మాత్రమే ఉందని, జిల్లాస్థాయిలో వారిని గుర్తించాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఇది గతంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులకు, అమల్లో ఉన్న

Published : 09 Aug 2022 06:08 IST

ఇది చట్టానికి విరుద్ధం: సుప్రీంకోర్టు

దిల్లీ: అల్పసంఖ్యాకులను రాష్ట్రస్థాయిలో గుర్తించే విధానం మాత్రమే ఉందని, జిల్లాస్థాయిలో వారిని గుర్తించాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఇది గతంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులకు, అమల్లో ఉన్న చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ మైనార్టీ యాక్ట్‌ 1992ను సవాల్‌ చేస్తూ వేసిన ఓ పిటిషన్‌పై ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌ ధర్మాసనం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించమని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని