PM Modi: మోదీ చరాస్తులు పెరిగాయ్‌

ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి స్థిరాస్తులు లేకపోగా, చరాస్తులు గతేడాది కంటే రూ.26.13 లక్షలు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504గా ఉందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) మంగళవారం వెల్లడించింది. ఇందులో

Updated : 10 Aug 2022 08:05 IST

గతేడాదితో పోల్చితే రూ.26 లక్షల వృద్ధి

మొత్తం ఆస్తులు రూ.2.23 కోట్లు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి స్థిరాస్తులు లేకపోగా, చరాస్తులు గతేడాది కంటే రూ.26.13 లక్షలు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504గా ఉందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులతో కలిసి 2002లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్లాటు కొనుగోలు చేయగా, అందులో తన వాటా కింద వచ్చిన భాగాన్ని మోదీ విరాళంగా ఇచ్చేశారు. రూ.1.1 కోట్ల విలువైన ఈ ఆస్తిని వదులుకోవడంతో ఆయనకు ఎలాంటి స్థిరాస్తులు లేకుండా పోయాయి. మోదీ పేరిట షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, వాహనాలు లేవు. మార్చి 31 నాటికి చేతిలో రూ.35,250 నగదు, రూ.1.73 లక్షల విలువజేసే నాలుగు బంగారు ఉంగరాలు, రూ.9.05 లక్షలకు పోస్టల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, రూ.1.89 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ కలిగి ఉన్నారు. ప్రధానితో పాటు పలువురు కేబినెట్‌ మంత్రులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో ధర్మేంద్ర ప్రధాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్‌, హర్దీప్‌సింగ్‌ పురి, పురుషోత్తం రూపాలా, జి.కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.2.54 కోట్ల విలువజేసే చరాస్తులు ఉన్నట్లు పీఎంవో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని