ధార్మిక సంస్థలకు రూ.1.67లక్షల కోట్ల పన్ను మినహాయింపు

ధార్మిక కార్యకలాపాల కింద నమోదైన 6,064 ట్రస్ట్‌లు, సంస్థలు 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో రూ.1,67,637.8 కోట్ల విలువైన ఆదాయపన్ను మినహాయింపులు పొందినట్లు కాగ్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇందులో

Published : 10 Aug 2022 05:03 IST

తెలుగు రాష్ట్రాల్లో రూ.13,225 కోట్ల వెసులుబాటు: కాగ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: ధార్మిక కార్యకలాపాల కింద నమోదైన 6,064 ట్రస్ట్‌లు, సంస్థలు 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో రూ.1,67,637.8 కోట్ల విలువైన ఆదాయపన్ను మినహాయింపులు పొందినట్లు కాగ్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇందులో ఏపీ, తెలంగాణలకు చెందిన 417 సంస్థలు రూ.13,225.4 కోట్ల మినహాయింపును పొందాయని తెలిపింది. ట్రస్టులు, ఇన్‌స్టిట్యూషన్ల కింద ఏపీ, తెలంగాణల్లో 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో 35,502 సంస్థలు ఆదాయపన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకున్నాయని పేర్కొంది. ఆడిట్‌కు రికార్డులు సమర్పించని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశాలు ప్రథమస్థానంలో ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో 1,177 ట్రస్ట్‌లు సెక్షన్‌ 12ఎఎ కింద నమోదుకాకపోయినా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 11 ప్రకారం రూ.1,045 కోట్ల పన్ను మినహాయింపు పొందాయని కాగ్‌ తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని