Venkaiah Naidu: ఉచితాలతో దెబ్బతింటున్న రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం

ఉచితాల సంస్కృతి కారణంగా పలు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఓట్లే లక్ష్యంగా పథకాలను ప్రవేశపెట్టడం సరికాదని హితవు పలికారు. పేదలు, అవసరంలో ఉన్నవారిని

Updated : 10 Aug 2022 05:30 IST

 వెంకయ్యనాయుడి ఆందోళన

ఈనాడు, దిల్లీ: ఉచితాల సంస్కృతి కారణంగా పలు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఓట్లే లక్ష్యంగా పథకాలను ప్రవేశపెట్టడం సరికాదని హితవు పలికారు. పేదలు, అవసరంలో ఉన్నవారిని ప్రభుత్వాలు కచ్చితంగా ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దిల్లీలోని తన నివాసంలో వెంకయ్యనాయుడు 2018, 2019 బ్యాచ్‌ల ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ అధికారులను ఉద్దేశించి మంగళవారం మాట్లాడారు. ‘‘అంతర్జాలం, సామాజిక మాధ్యమాల విస్తరణతో ఇన్‌స్టంట్‌ జర్నలిజం పెరిగిపోతోంది. ఇది పాత్రికేయ సూత్రాలు, విలువల పతనానికి దారితీస్తోంది. వార్తను అభిప్రాయాలతో కలపకూడదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా. ప్రజాస్వామ్య విలువల మనుగడకు దాని తటస్థత, నిజాయతీ, నిష్పాక్షికత అత్యంత ముఖ్యం. సమాచార కమ్యూనికేషన్‌ సాంకేతికత విప్లవం, ఇంటర్‌నెట్‌ విస్తరణ వల్ల సమాచార ప్రసారం సులభతరంగా మారింది. దాంతోపాటే ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. దీన్ని ప్రభుత్వ కమ్యూనికేటర్లు అడ్డుకోవాలి. యువ అధికారులు అభివృద్ధి కథనాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలి’’ అని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని