Covid Certificate: టీకా ధ్రువీకరణపత్రం ఇబ్బందులకు చెల్లు

భారత్‌ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందే కొవిడ్‌-19 టీకా ధ్రువీకరణపత్రం లేదా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న నియమాన్ని తొలగించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.

Updated : 10 Aug 2022 05:32 IST

సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న నియమాన్ని తొలగించనున్న ప్రభుత్వం

దిల్లీ: భారత్‌ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందే కొవిడ్‌-19 టీకా ధ్రువీకరణపత్రం లేదా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న నియమాన్ని తొలగించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో ‘స్వీయ ప్రకటన ఫామ్‌’ను పూరించే విధానం యథావిధిగా కొనసాగుతుందని అధికారవర్గాలు మంగళవారం పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. ‘‘అంతర్జాతీయ విమాన ప్రయాణికులు భారత్‌కు రావడానికి ముందు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో కొవిడ్‌-19 ధ్రువీకరణపత్రం లేదా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ను అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధనను తొలగించే విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ ఆరోగ్య శాఖ నుంచి సూచనలు కోరింది’’ అని అధికారవర్గాలు తెలిపాయి. నిబంధన తొలగింపునకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికే తన ఆమోదం తెలియజేసిందని వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని