ఆవేదన దిగమింగి.. కారుణ్యం ఉప్పొంగి..

రెండేళ్ల కిందటి విమాన ప్రమాదమది.. కేరళలోని కరిపుర్‌ గ్రామ సమీప కోజికోడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం గతి తప్పింది. 2020 ఆగస్టు 7న జరిగిన ఈ ప్రమాదంలో 190 మంది ప్రయాణికులతో దుబాయ్‌

Published : 10 Aug 2022 05:59 IST

ఆదుకొన్న గ్రామస్థులకు ఆసుపత్రి కడుతున్న విమాన ప్రమాద బాధితులు

కోజికోడ్‌ (కేరళ): రెండేళ్ల కిందటి విమాన ప్రమాదమది.. కేరళలోని కరిపుర్‌ గ్రామ సమీప కోజికోడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం గతి తప్పింది. 2020 ఆగస్టు 7న జరిగిన ఈ ప్రమాదంలో 190 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం రన్‌ వే దాటి, 35 అడుగుల లోతు లోయలో పడి ముక్కలైంది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌ సహా 18 మంది మృతిచెందారు. సమీప గ్రామస్థులు పరుగు పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నాటి విషాదంలో ప్రాణాలతో బయటపడ్డవారు, ఆప్తులను కోల్పోయినవారు 184 మంది ‘మలబార్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం’ (ఎండీఎఫ్‌) పేరిట ఓ కార్యాచరణ వేదికగా మారారు. తలో చెయ్యి వేసి రూ.50 లక్షలు పోగు చేశారు. కొంతమంది తమకు అందిన పరిహారం అలాగే ఇచ్చేశారు. నాటి కాళరాత్రిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రయాణికులను మానవత్వంతో ఆదుకొన్న ఆ గ్రామస్థుల కోసం పీహెచ్‌సీ భవన నిర్మాణాన్ని తలపెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్‌ పేషెంట్‌ సదుపాయాలు, ఫార్మసీ, లేబొరేటరీతో ప్రభుత్వ వైద్యసాయం అందించే ఆసుపత్రి ఇదొక్కటే అవుతుంది. ఎండీఎఫ్‌ చైర్మన్‌ అబ్దురహిమాన్‌ ఎడక్కుని మాట్లాడుతూ.. ‘విమాన ప్రమాదం జరిగినపుడు.. 300 మీటర్ల దూరంలోనే పీహెచ్‌సీ ఉన్నా సదుపాయలు లేనందున మాకు ఉపయోగం లేకపోయింది. అందుకే ఈ కార్యక్రమం తలపెట్టాం. జిల్లా వైద్యాధికారి సహకరించారు. త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని