తీర్పులు సూటిగా, స్పష్టంగా రాయాలి

న్యాయమూర్తులు తీర్పులను సూటిగా, స్పష్టంగా రాయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. వాటి అంతిమ వినియోగదారులైన కక్షిదారులకు అర్థమయ్యేలా రాయాలని కోరారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన

Published : 11 Aug 2022 05:25 IST

జడ్జీలకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచన

ఈనాడు, దిల్లీ: న్యాయమూర్తులు తీర్పులను సూటిగా, స్పష్టంగా రాయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. వాటి అంతిమ వినియోగదారులైన కక్షిదారులకు అర్థమయ్యేలా రాయాలని కోరారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన ‘1969 ముందునాటి సుప్రీంకోర్టు కేసుల సంపుటాల విడుదల’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇప్పటికీ కొంత మందికి మాత్రమే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించిన అవగాహన ఉంది. అదే యూరోపియన్‌ దేశాలు, అమెరికాలో అయితే స్కూలు పిల్లాడి నుంచి అందరూ వాటి గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ తన హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకొనే పరిస్థితి ఉండాలి. అందుకోసమే సుప్రీంకోర్టు ప్రచురించే జర్నల్స్‌లో ముఖ్యమైన తీర్పుల సారాంశాన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచాలన్నది నా సూచన. ప్రభుత్వం కూడా రాజ్యాంగ విషయాలను ప్రచారం చేయడానికి ఆర్థిక సాయం చేయాలి. ప్రస్తుతం తీర్పులు సుదీర్ఘంగా, పరిశోధన పత్రాల్లా ఉంటున్నాయి, అందులో ముఖ్యమైన అంశాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టమవుతోందన్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తులు తీర్పులు సూటిగా, స్పష్టంగా రాయాల’’ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న, అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దతార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని