పశువుల్లో ‘లంపీ’ కట్టడికి టీకా

గత కొద్ది నెలలుగా వివిధ రాష్ట్రాల్లో పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)కు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకాను వీలయినంత త్వరలో ఉత్పత్తి చేసేందుకు

Published : 11 Aug 2022 05:25 IST

అభివృద్ధి చేసిన ఐసీఏఆర్‌

దిల్లీ: గత కొద్ది నెలలుగా వివిధ రాష్ట్రాల్లో పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)కు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకాను వీలయినంత త్వరలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇంతవరకు దేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడ్డాయి. అత్యధికంగా రాజస్థాన్‌లో 2,111 మూగజీవాలు చనిపోగా గుజరాత్‌ (1,679), పంజాబ్‌ (672), హిమాచల్‌ప్రదేశ్‌ (38), అండమాన్‌ నికోబార్‌ (29) ఉత్తరాఖండ్‌ (26)లలోనూ పశు మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఐసీఏఆర్‌ పరిధిలోని జాతీయ అశ్వ పరిశోధన కేంద్రం (హిసార్‌, హరియాణా), భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఇజ్జత్‌నగర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌)లు ‘లంపీ-ప్రోవాక్‌ఇండ్‌’ టీకాను అభివృద్ధి చేశాయి. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంబంధిత సాంకేతికతను కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పురుషోత్తం రూపాలాలు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని