దిల్లీలో బయటపడ్డ కొత్త ఉప వేరియంట్‌

కొవిడ్‌ కారక ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వైద్య నిపుణులు తాజాగా కొత్త ఉప రకాన్ని గుర్తించారు. ‘బి.ఎ 2.75’గా పిలుస్తున్న ఈ ఉప వేరియంట్‌ దిల్లీలో పలువురి నమూనాల్లో బయటపడింది. ఒమిక్రాన్‌ కంటే వేగంగా అది వ్యాప్తి చెందుతున్నట్లు స్థానిక

Published : 11 Aug 2022 05:25 IST

దిల్లీ: కొవిడ్‌ కారక ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వైద్య నిపుణులు తాజాగా కొత్త ఉప రకాన్ని గుర్తించారు. ‘బి.ఎ 2.75’గా పిలుస్తున్న ఈ ఉప వేరియంట్‌ దిల్లీలో పలువురి నమూనాల్లో బయటపడింది. ఒమిక్రాన్‌ కంటే వేగంగా అది వ్యాప్తి చెందుతున్నట్లు స్థానిక లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ (ఎన్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. గతంలో కొవిడ్‌ బారిన పడ్డ వ్యక్తుల్లోని రోగ నిరోధక శక్తిని, టీకాలతో సమకూరిన రక్షణను ‘బి.ఎ 2.75’ బోల్తా కొట్టించగలుగుతున్నట్లు ఆయన అంచనా వేశారు. అయితే ఈ తరహా కేసుల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటోందని వెల్లడించారు. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రం కొత్త ఉప వేరియంట్‌తో కొంత ఎక్కువ ముప్పు పొంచి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో కొన్నిరోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts