పట్టణప్రాంత పీఎంఏవై 2024 వరకు పొడిగింపు

పట్టణ ప్రాంతాల్లో ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ (పీఎంఏవై)ను 2024 డిసెంబరు 31 వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పట్టణాల్లో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం వాస్తవానికి

Updated : 11 Aug 2022 06:26 IST

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ (పీఎంఏవై)ను 2024 డిసెంబరు 31 వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పట్టణాల్లో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే ముగిసిపోవాల్సి ఉంది. రాష్ట్రాల వినతి మేరకు దీనిని పొడిగించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు మంజూరైన 122.69 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. గృహ నిర్మాణంపై 2004-14 మధ్య రూ.20,000 కోట్లు ఖర్చయితే, 2015 నుంచి ఇప్పటివరకు రూ.2.03 లక్షల కోట్లకు ఆమోదం తెలిపి ఇప్పటికే రూ.1.18 లక్షల కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని