‘ఎట్‌ హోం’కు వారినీ ఆహ్వానించండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు నిర్వహించే ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి ఈసారి వివిధ రంగాలకు చెందిన వారినీ ఆహ్వానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీల)కు కేంద్రం నిర్దేశించింది. ప్రొటోకాల్‌ మేరకు

Published : 11 Aug 2022 05:25 IST

రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు నిర్వహించే ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి ఈసారి వివిధ రంగాలకు చెందిన వారినీ ఆహ్వానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీల)కు కేంద్రం నిర్దేశించింది. ప్రొటోకాల్‌ మేరకు ఆహ్వానించేవారితో పాటు ఇంకా ఎవరెవరిని పిలవాలో పేర్కొంటూ కేంద్ర హోంశాఖ సమాచారం పంపించింది. ఈమేరకు మహిళా సర్పంచులు, అమరవీరులైన సైనికులకు చెందిన కుటుంబీకులు, ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ ప్రస్తావించిన వ్యక్తులనూ ఆహ్వానించాలని తెలిపింది. అలాగే వివిధ రంగాల్లో సత్తా చాటిన దివ్యాంగులను, సమాజానికి ఆదర్శనీయమైన సేవలు అందించినవారిని, పద్మ పురస్కారాలు అందుకున్నవారిని, జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లో సత్తాచాటిన వారికీ ఆహ్వానం పంపాలని పేర్కొంది.  ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సందర్భంగా ఈనెల 13, 14, 15 తేదీల్లో ప్రతిఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts