పంద్రాగస్టు వేడుకల్లో స్వదేశీ శతఘ్నుల వందనం

స్వాతంత్య్రదిన వేడుకల్లో మొదటిసారిగా దేశంలో తయారైన హోవిట్జర్‌ శతఘ్నులు మోత మోగించనున్నాయి. ఎర్రకోట వద్ద 21 - తుపాకుల వందనానికి వీటిని ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్‌

Published : 11 Aug 2022 05:15 IST

దిల్లీ: స్వాతంత్య్రదిన వేడుకల్లో మొదటిసారిగా దేశంలో తయారైన హోవిట్జర్‌ శతఘ్నులు మోత మోగించనున్నాయి. ఎర్రకోట వద్ద 21 - తుపాకుల వందనానికి వీటిని ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా డీఆర్డీవో చొరవతో ఈ అధునాతన శతఘ్నులను రూపొందించారు. ఇప్పటిదాకా సంప్రదాయబద్ధంగా వాడుతూ వచ్చిన బ్రిటిష్‌ శతఘ్నులతోపాటు ‘హోవిట్జర్‌’ కూడా గర్జించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని