ప్రియాంకా గాంధీకి కొవిడ్‌

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా 3 నెలల వ్యవధిలో మళ్లీ కొవిడ్‌ బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె బుధవారం తెలిపారు. నిబంధనల మేరకు తాను ఇంటివద్ద ఐసొలేషన్‌లోకి

Published : 11 Aug 2022 05:15 IST

 3 నెలల వ్యవధిలో రెండోసారి..

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా 3 నెలల వ్యవధిలో మళ్లీ కొవిడ్‌ బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె బుధవారం తెలిపారు. నిబంధనల మేరకు తాను ఇంటివద్ద ఐసొలేషన్‌లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లోనూ ఆమెకు కొవిడ్‌ సోకింది. ప్రియాంక, మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కొవిడ్‌ బారినపడిన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన రాజస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఆల్వార్‌ జిల్లా తిజారాలో బుధవారం కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కాగా కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం అధిపతి పవన్‌ ఖేరా, పార్టీ నేత అభిషేక్‌ మను సింఘ్వీలకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాను కొవిడ్‌ బారిన పడినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే మంగళవారం సాయంత్రం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు