పార్లమెంటులో ఈ సంస్కరణ జరగాలి

పార్లమెంటులో రాతపూర్వక సమాధానాలిచ్చే విషయంలో ఓ కీలక సంస్కరణ జరగాలి. సభ్యుల ప్రశ్నలకు ‘కాదు’ అని జవాబిచ్చే సందర్భంలో అందరినీ ‘నో సర్‌’ అనే సంబోధిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులోనూ ఇలా పురుష దృష్టికోణంలోనే వ్యవహరించడం

Published : 11 Aug 2022 05:15 IST

పార్లమెంటులో రాతపూర్వక సమాధానాలిచ్చే విషయంలో ఓ కీలక సంస్కరణ జరగాలి. సభ్యుల ప్రశ్నలకు ‘కాదు’ అని జవాబిచ్చే సందర్భంలో అందరినీ ‘నో సర్‌’ అనే సంబోధిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులోనూ ఇలా పురుష దృష్టికోణంలోనే వ్యవహరించడం ఆందోళనకరం. సభ్యుల జెండర్‌ను బట్టి సరైన రీతిలో సంబోధించేలా తగిన ఆదేశాలివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి లేఖ రాశాను.

- ప్రియాంకా చతుర్వేది


ఆ పోరాటంలో ప్రాంతీయ పార్టీలది కీలకపాత్ర

బిహార్‌లో జరిగిన పరిణామం ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాకూడదు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి నిజమైన ప్రారంభం కావాలి. మతతత్వ, విభజన శక్తులపై చేసే పోరాటంలో ప్రాంతీయ పార్టీలది ఎప్పటికీ కీలక పాత్రే. 

- మెహబూబా ముఫ్తీ


 ఆసియా సింహాల సంఖ్యలో పెరుగుదల

సింహాలు లేని అడవి నాశనమవుతుంది. అడవులు లేకుండా సింహాలు మనుగడ సాగించలేవు. దీన్ని గుర్తుంచుకుని సింహాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. అవి సత్ఫలితాలనిచ్చాయి. ఆసియా సింహాల సంఖ్యలో 28.87 శాతం పెరుగుదల నమోదైంది. సింహాల ఉనికి ఉన్న ప్రాంత విస్తీర్ణం కూడా పెరిగింది. 

- భూపేంద్ర యాదవ్‌


ప్రభుత్వ సొమ్ముపై రెఫరెండం నిర్వహించాలి

ప్రభుత్వ సొమ్మును ఒక పార్టీ కోరుకుంటున్నట్లుగా ఒక్క కుటుంబంపైనే ఖర్చు పెట్టాలా లేదా మరో పార్టీ చేస్తున్నట్లు సన్నిహితుల కోసమే వెచ్చించాలా లేదా దేశంలో మంచి పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణంపై వ్యయం చేయాలా అన్న విషయంపై రెఫరెండం నిర్వహించాలి.  

- కేజ్రీవాల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని