కార్యాలయ సిబ్బంది కుమార్తెలతో ప్రధాని రక్షాబంధన్‌

సోదర భావాన్ని ప్రస్ఫుటించే రక్షాబంధన్‌ పర్వదినాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో పనిచేసే సిబ్బంది కుమార్తెలతో కలసి \

Published : 12 Aug 2022 05:58 IST

దిల్లీ: సోదర భావాన్ని ప్రస్ఫుటించే రక్షాబంధన్‌ పర్వదినాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో పనిచేసే సిబ్బంది కుమార్తెలతో కలసి ఆయన రాఖీ వేడుకలో పాల్గొన్నారు. పీఎంవో అధికారులతో పాటు స్వీపర్లు, ప్యూన్లు, గార్డెన్‌ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల కుమార్తెలతో రాఖీ కట్టించుకున్నారు. ఆ తర్వాత వారితో కాసేపు సరదాగా ముచ్చటించి, చిన్నారులను ఆశీర్వదించారు. దీంతోపాటు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా వారికి జాతీయ జెండాలను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ప్రధాని ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘ఈ చిన్నారులతో నా రక్షా బంధన్‌ ప్రత్యేకం. జాతీయ జెండాతో ప్రతి ఒక్క భారతీయుడికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తిరంగాను ఇస్తున్నప్పుడు ఆ చిన్నారుల్లో కనిపించిన ఉత్సాహమే అందుకు నిదర్శనం’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు, ఆయన ట్విటర్‌ వేదికగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని