విమానంలో ధూమపానం.. వీడియో ఆధారంగా చర్యలు

బాడీబిల్డర్‌ బాబీ కటారియా ఓ విమానంలో సీట్లపై పడుకొని దర్జాగా లైటర్‌ వెలిగించి, సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే స్పైస్‌జెట్‌ విమానంలో జనవరి 20న ఈ ఘటన చోటు చేసుకుంది

Published : 12 Aug 2022 05:58 IST

దిల్లీ: బాడీబిల్డర్‌ బాబీ కటారియా ఓ విమానంలో సీట్లపై పడుకొని దర్జాగా లైటర్‌ వెలిగించి, సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే స్పైస్‌జెట్‌ విమానంలో జనవరి 20న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను ఆయనే సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీనిని ట్విటర్‌లో ఒకరు పోస్టు చేస్తూ.. బాబీ కటారియాకు కొత్త నిబంధనలా అని ప్రశ్నించారు. పౌరవిమానయాన భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ దృష్టికి ఇది రావడంతో కటారియాపై కేసు నమోదు చేసింది. విమానంలోకి లైటర్‌ను తీసుకువెళ్లడం, లోపలే సిగరెట్‌ కాల్చడాన్ని తీవ్రంగా పరిగణించిన పౌరవిమానయాన శాఖ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రయాణికులు విమానంలోకి వస్తున్నప్పుడు, సిబ్బంది దానికి సంబంధించిన తనిఖీ పనుల్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని స్పైస్‌జెట్‌ తెలిపింది. అతనిపై 15 రోజుల పాటు ప్రయాణ నిషేధాన్ని ఫిబ్రవరిలోనే విధించినట్లు స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని