తపాలా కార్యాలయాల్లో జోరుగా త్రివర్ణ పతాకాల విక్రయాలు

స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పిలుపునిచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తపాలా శాఖ విశేషంగా కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 1.5 లక్షల

Published : 12 Aug 2022 05:58 IST

దిల్లీ: స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పిలుపునిచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తపాలా శాఖ విశేషంగా కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 1.5 లక్షల కార్యాలయాల ద్వారా, ఆన్‌లైన్‌లో గత 10 రోజుల్లో ఈ విభాగం కోటికి పైగా జాతీయ పతాకాలను విక్రయించింది. ఒక్కో జెండా   రూ.25 చొప్పున తపాలా శాఖ అమ్ముతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఆన్‌లైన్‌ వేదికగా ఇప్పటివరకు 1.75 లక్షల పతాకాలను కొనుగోలు చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని