ఉచితాలపై పేదల్లో భయం పెంచుతున్న కేజ్రీవాల్‌

ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉచిత పథకాలపై చర్చల్లో విద్య, వైద్యాన్ని కూడా కలిపి పేదల్లో భయాన్ని పెంచుతున్నారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును విద్య,

Published : 12 Aug 2022 06:12 IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉచిత పథకాలపై చర్చల్లో విద్య, వైద్యాన్ని కూడా కలిపి పేదల్లో భయాన్ని పెంచుతున్నారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును విద్య, వైద్యాలకు కేటాయించడంపై రెఫరెండెం కోరిన కేజ్రీవాల్‌ చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఆ రెండు రంగాలకు చేసే  కేటాయింపులను ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ దిశగా దేశం చేస్తున్న కృషికి ఆటంకాలుగా ఉన్న ఆర్థిక విపత్తుల గురించి మాత్రమే ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు.

ఇతర పార్టీల్లా భాజపా రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలను అమలు చేయబోదని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తెలిపారు. మహా ధనవంతులైన కేంద్ర సర్కారు మిత్రులు రూ.కోట్ల రుణాలు, పన్నులు ఎగవేయడంతో సంక్షేమ పథకాలకు నిధుల్లేక భాజపా సర్కారు ఉచితాలను గట్టిగా వ్యతిరేకిస్తోందని కేజ్రీవాల్‌ గురువారం మళ్లీ ధ్వజమెత్తారు. డిజిటల్‌ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని