అనుమానం ఉందని దోషిగా ప్రకటించకూడదు: సుప్రీంకోర్టు

నేరం చేశాడన్న అనుమానంతో నిందితుడిని దోషిగా ప్రకటించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనుమానం ఎంత బలంగా ఉన్నా, దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని న్యాయమూర్తులు జస్టిస్‌

Published : 12 Aug 2022 06:34 IST

దిల్లీ: నేరం చేశాడన్న అనుమానంతో నిందితుడిని దోషిగా ప్రకటించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనుమానం ఎంత బలంగా ఉన్నా, దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ధర్మాసనం పేర్కొంది. హత్య, ఇతర అభియోగాలపై జీవితఖైదు పడిన ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. హత్యకు గురైన వ్యక్తికి పోస్టుమార్టం జరిగిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేని విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఏకీభవించిన ధర్మాసనం.. నిందితుడు నేరం చేశాడని ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా నిరూపితమైతేనే దోషిగా ప్రకటించాలని,  లేకపోతే అతడు అమాయకుడేనేని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని