ATM: వరదల్లో కొట్టుకుపోయిన ఏటీఎం.. ఎంత డబ్బు పోయిందో తెలుసా?

ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమోలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా పురోలాలో నది ఒడ్డున

Updated : 12 Aug 2022 09:28 IST

ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమోలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా పురోలాలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో ఒకదానిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం కూడా ఉంది. బుధవారం సాయంత్రమే అధికారులు ఏటీఎంలో రూ.24లక్షలు నగదు జమ చేశారు. ఇందులో ఎంత మొత్తాన్ని కస్టమర్లు డ్రా చేశారు, వరదల్లో ఎంత సొమ్ము కొట్టుకుపోయిందనే లెక్కలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని