సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్‌

‘‘రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న మాకు ఇలాంటి భోజనం పెడతారా? దీన్ని అసలు ఎవరైనా తినగలరా?’’ అంటూ నడిరోడ్డుపై బోరున విలపించాడు ఓ కానిస్టేబుల్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని

Updated : 12 Aug 2022 08:01 IST

‘‘రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న మాకు ఇలాంటి భోజనం పెడతారా? దీన్ని అసలు ఎవరైనా తినగలరా?’’ అంటూ నడిరోడ్డుపై బోరున విలపించాడు ఓ కానిస్టేబుల్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని పోలీస్‌ మెస్‌లో తమకు అందించే ఆహారం అస్సలు బాగుండడం లేదని, ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ మనోజ్‌ కుమార్‌.. బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ.1,875 ఇస్తామన్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్‌ కాగా.. సీనియర్‌ ఎస్పీ ఆశిష్‌ తివారీ దర్యాప్తునకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్‌పై మొత్తం 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటి సంగతి కూడా తేల్చాలని సీఐని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని