Rahul Gandhi: కష్టసుఖాల్లో తోడుగా నిలిచాం.. ప్రియాంకతో అనుబంధాన్ని పంచుకున్న రాహుల్

రక్షాబంధన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ వివిధ

Updated : 12 Aug 2022 10:10 IST

దిల్లీ: రక్షాబంధన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ వివిధ దశల్లో జరుపుకొన్న రక్షాబంధన్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వారి మధ్య ఉన్న అనుబంధం వాటిలో ప్రస్ఫుటమవుతోంది. ‘‘నేను, నా సోదరి ప్రియాంక బాల్యం నుంచి ఒకరికొకరం తోడుగా నిలిచాం. కష్టసుఖాల్లోనూ పరస్పరం అండగా ఉంటూ ధైర్యం చెప్పుకొన్నాం. సోదరి, ఈ బంధం శాశ్వతంగా ఉంటుంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని