రూ.300 కోట్ల మంత్రి డెవలపర్స్‌ ఆస్తుల జప్తు

అక్రమంగా నగదు బదిలీ, వంచన ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు స్థిరాస్తి సంస్థ మంత్రి గ్రూపునకు చెందిన రూ.300.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌

Published : 13 Aug 2022 05:09 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: అక్రమంగా నగదు బదిలీ, వంచన ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు స్థిరాస్తి సంస్థ మంత్రి గ్రూపునకు చెందిన రూ.300.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. మంత్రి సెరినిటీ, మంత్రి వెబ్సిటీ, మంత్రి ఎనర్జియా రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల పేరిట, తన అనుబంధ సంస్థలు క్యాజిల్స్‌ విస్టా ప్రైవేట్ లిమిటెడ్‌, బాయెంట్ టెక్నాలజీస్‌ కన్సల్టేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ల ద్వారా ఫ్లాట్లను కొనేందుకు వచ్చినవారికి నకిలీ బ్రోచర్లు చూపించి, నాసిరకం పనులతో వినియోగదారులను వంచించినట్లు ఈ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలుదారుల నుంచి నగదు తీసుకుని పదేళ్లయినా ఫ్లాట్లు ఇవ్వలేదు. ఈ కోణంలో సుబ్రహ్మణ్యపుర, కబ్బన్‌పార్కు పోలీసుస్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కేసుల ఆధారంగా ఈడీ అధికారులు సంస్థ యజమాని సుశీల్‌ మంత్రిని 2022 జూన్‌ 6న అరెస్టు చేశారు. బెయిలుపై బయటకు వచ్చిన ఆయనను ఈ నెల ఆరో తేదీన విచారించారు. తాజాగా ఆస్తులు జప్తు చేశామని ఈడీ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని