పంది శరీరం నుంచి కార్నియా ఇంప్లాంట్‌

కంట్లో దెబ్బతిన్న కార్నియా (శుక్లపటలం) కారణంగా అంధత్వ సమస్యలను ఎదుర్కొంటున్న 20 మంది (12 మంది ఇరాన్‌ దేశస్థులు, 8మంది భారతీయులు) రోగులకు మళ్లీ చూపు తెప్పించేందుకు శాస్త్రవేత్తలు పంది శరీరం నుంచి తయారుచేసిన

Published : 13 Aug 2022 05:09 IST

20 మందికి చూపు పునరుద్ధరణ

దిల్లీ: కంట్లో దెబ్బతిన్న కార్నియా (శుక్లపటలం) కారణంగా అంధత్వ సమస్యలను ఎదుర్కొంటున్న 20 మంది (12 మంది ఇరాన్‌ దేశస్థులు, 8మంది భారతీయులు) రోగులకు మళ్లీ చూపు తెప్పించేందుకు శాస్త్రవేత్తలు పంది శరీరం నుంచి తయారుచేసిన ఇంప్లాంట్‌ను ఉపయోగించారు. కార్నియా సంబంధ అంధత్వంతో బాధపడే కోట్లాది మందిలో ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. దిల్లీలోని  ఎయిమ్స్‌ శాస్త్రవేత్తలు సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ ఘనత సాధించింది. వీరు దానంగా సమీకరించిన మానవ కార్నియాలకు ప్రత్యామ్నాయంగా బయోఇంజినీర్డ్‌ ఇంప్లాంట్లను ఉపయోగించారు. ‘‘ఫలితాలను పరిశీలిస్తే.. మానవ ఇంప్లాంట్‌లుగా ఉపయోగించేందుకు అవసరమైన జీవపదార్థాన్ని అభివృధ్ధి చేయడం సాధ్యమేనని స్పష్టమవుతోంది. ఈ పదార్థాన్ని రెండేళ్ల వరకు నిల్వ చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా మరింత మందికి అంధత్వ సమస్యల నుంచి విముక్తి కల్పించగలం’’ అని స్వీడన్‌లోని లింకోపింగ్‌ వర్సిటీకి చెందిన  నీల్‌ లగాలీ తెలిపారు.

కార్నియాలో ప్రధానంగా ప్రాటీన్‌ కొల్లాజెన్‌ ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయం తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుని పంది చర్మం నుంచి కొల్లాజెన్‌ కణాలను సేకరించారు. వదులుగా ఉండే ఈ కణాలను ఒకింత దృఢంగా, పారదర్శకంగా మార్చారు. ఫలితంగా ఇవి కంటిలో ఇంప్లాంట్‌ చేసేందుకు అనుగుణంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని