28న నోయిడా ట్విన్‌టవర్స్‌ కూల్చివేత

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌టవర్స్‌ను కూల్చివేసే తేదీని సుప్రీంకోర్టు కాస్త పొడిగించింది. ఈ నెల 21న కూల్చివేయాలని గత ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే శుక్రవారం ఈ తేదీని ఆగస్టు 28గా ఖరారు చేసింది.

Published : 13 Aug 2022 05:53 IST

తేదీ ఖరారు చేసిన సుప్రీం కోర్టు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌టవర్స్‌ను కూల్చివేసే తేదీని సుప్రీంకోర్టు కాస్త పొడిగించింది. ఈ నెల 21న కూల్చివేయాలని గత ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే శుక్రవారం ఈ తేదీని ఆగస్టు 28గా ఖరారు చేసింది. సాంకేతిక, ఇతర కారణాలతో అడ్డంకులు ఏర్పడితే సెప్టెంబరు 4 వరకు గడువు తీసుకోవచ్చని అధికారులకు సూచించింది. నోయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ భారీ గృహ ప్రాజెక్టును 2009లో ప్రారంభించింది. ఇందులో నిర్మించిన ట్విన్‌టవర్స్‌.. నిబంధనలకు అనుగుణంగా లేవని తేలడంతో నిరుడు ఆగస్టు 31న వీటిని కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్లాట్లు, దుకాణాలు కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని నిర్మాణసంస్థ సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని