ఈవీఎంల వినియోగంపై పిటిషన్‌ కొట్టివేత

ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులకు బదులు ఈవీఎంల వినియోగానికి బాటలు వేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధన రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం

Published : 13 Aug 2022 05:53 IST

దిల్లీ: ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులకు బదులు ఈవీఎంల వినియోగానికి బాటలు వేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధన రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. పార్లమెంటు అధికారాలను వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 100ను ప్రస్తావిస్తూ.. సెక్షన్‌ 61ఏ పైన న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణార్హత లేనందున పిటిషన్‌ను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని