Bobby Katariya: ఈ రోడ్డు మా బాబుది..

బాడీ బిల్డర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ బాబీ కటారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. విమానం సీట్లో పడుకొని సిగరెట్‌ కాల్చిన ఘటనకు సంబంధించి అతడిపై ఇటీవలే కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నడి రోడ్లో

Updated : 13 Aug 2022 09:33 IST

 రహదారిపై కుర్చీ వేసుకుని మద్యం సేవించిన బాబీ కటారియా

కేసు నమోదు

దేహ్రాదూన్‌: బాడీ బిల్డర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ బాబీ కటారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. విమానం సీట్లో పడుకొని సిగరెట్‌ కాల్చిన ఘటనకు సంబంధించి అతడిపై ఇటీవలే కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నడి రోడ్లో కూర్చొని మద్యం సేవించినందుకు అతడిపై మరో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌-ముస్సోరీ రహదారిపై కుర్చీలో కూర్చొని మద్యం తాగుతున్న వీడియోను కటారియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో నేపథ్యంలో ‘రోడ్స్‌ అప్నే బాప్‌ కీ..(ఈ రోడ్లు మా నాన్నవి..)’ అనే పాట వినిపిస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కటారియాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ డీజీపీ శుక్రవారం వెల్లడించారు. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ సంస్కృతిని కటారియా నాశనం చేస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు 6.3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని