కందిపప్పు నిల్వలను బహిర్గతం చేయాలి

కందిపప్పు వ్యాపారులు వాటి నిల్వలను బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.  నిల్వదారులు అంతా తమ వద్ద ఉన్న నిల్వలను ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా రాష్ట్రాలు చర్యలు

Published : 13 Aug 2022 05:53 IST

ఆ దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి: కేంద్రం

ఈనాడు, దిల్లీ: కందిపప్పు వ్యాపారులు వాటి నిల్వలను బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.  నిల్వదారులు అంతా తమ వద్ద ఉన్న నిల్వలను ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. కొందరు వ్యాపారులు నియంత్రిత పద్ధతిలో కందిపప్పు విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుకు యత్నిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వర్షాలు అధికంగా కురవడంవల్ల పొలాల్లో నీళ్లు నిలిచి గత ఏడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో విత్తనసాగు మందగించిందని, ఫలితంగా జులై 2వ వారం నుంచి కందిపప్పు చిల్లర ధర పెరగడం ప్రారంభమైందని తెలిపింది. అందువల్ల దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో పప్పుదినుసుల లభ్యత, ధరలను సూక్ష్మంగా పరిశీలిస్తూ రాబోయే పండుగల సీజన్‌లో అకస్మాత్తుగా ధరలు పెరగకుండా  ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని