జాతీయ పతాకం ఎగురవేయని వ్యక్తుల్ని దేశం విశ్వసించదు

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయని వ్యక్తుల్ని దేశం విశ్వసించదని ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడు మహేంద్ర భట్‌ అన్నారు. ‘‘దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి

Published : 13 Aug 2022 05:53 IST

ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడి వ్యాఖ్య

దేహ్రాదూన్‌: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయని వ్యక్తుల్ని దేశం విశ్వసించదని ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడు మహేంద్ర భట్‌ అన్నారు. ‘‘దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి భారతీయులకు ఎందుకు ఇబ్బంది?’’ అని భట్‌ ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగురని ఇళ్ల ఫొటోలను తనకు పంపించాలంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భాజపా కార్యకర్తల ఇళ్లకు సంబంధించి మాత్రమే తాను ఆ మాటలు అన్నానని, సాధారణ ప్రజల గురించి కాదని వివరించారు. ప్రధాని మోదీ పిలుపునకు భాజపా కార్యకర్తలు అందరూ స్పందించాలనే ఉద్దేశంతో తాను ఆ మాటలు అన్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇతర పార్టీల నేతలు తప్పుపట్టడంపై భట్‌ స్పందిస్తూ....దేశభక్తి కలిగిన వారెవరూ జాతీయ జెండాను ఎగురవేయడానికి ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని