నాడు భయం.. నేడు ఉత్సాహం

అస్సాంలో ఒకప్పుడు వేర్పాటువాద సంస్థల బహిష్కరణ పిలుపుల మధ్య స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు జనం భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నేడు నగరంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలే

Published : 13 Aug 2022 05:53 IST

అస్సాంలో స్వాతంత్య్ర ఉత్సవాల స్ఫూర్తి

ఈనాడు, గువాహటి: అస్సాంలో ఒకప్పుడు వేర్పాటువాద సంస్థల బహిష్కరణ పిలుపుల మధ్య స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు జనం భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నేడు నగరంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలే కనిపిస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజలు ఆజాదీ కా అమృతోత్సవ్‌ పేరిట చేపడుతున్న ర్యాలీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో పెద్దఎత్తున జనం పాల్గొంటుండటం విశేషం. కొంతకాలంగా ఇక్కడి ప్రజల్లో మార్పు వచ్చిందని, తీవ్రవాదం, హింసలతో విసిగిపోయిన వారు దేశభక్తికి, జాతీయభావాలకు విలువనిస్తున్నారని వృద్ధులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్వాతంత్య్ర దినోత్సవాలకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దిమా హసావొ జిల్లా కేంద్రం హాఫ్లాంగ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అస్సాం రైఫిల్స్‌ జవాన్లతో కలిసి శుక్రవారం భారీగా నిర్మించిన మానవహారం విశేషంగా ఆకట్టుకుంది. దుబ్రి జిల్లా అధికారుల నేతృత్వంలో బ్రహ్మపుత్ర నదిపై 75 పడవలతో శనివారం ఉదయం భారీ ప్రదర్శన సాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని