సాగుకు సహకారం అందించండి

ప్రతి గ్రామ పంచాయతీలోనూ సహకార సంఘాలను నెలకొల్పి వ్యవసాయ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా సూచించారు. దేశంలో 3 లక్షల పంచాయతీలుంటే 95 వేల ప్రాథమిక సహకార పరపతి

Published : 13 Aug 2022 05:53 IST

దేశంలో మరో 2 లక్షల పీఏసీఎస్‌ల ఏర్పాటు లక్ష్యం
కేంద్ర మంత్రి అమిత్‌ షా

దిల్లీ: ప్రతి గ్రామ పంచాయతీలోనూ సహకార సంఘాలను నెలకొల్పి వ్యవసాయ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా సూచించారు. దేశంలో 3 లక్షల పంచాయతీలుంటే 95 వేల ప్రాథమిక సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) మాత్రమే ఉన్నాయని, ఈ సంఖ్యను రానున్న ఐదేళ్లలో 3 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థపై దిల్లీలో శుక్రవారం కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్‌స్కాబ్‌) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో అమిత్‌ షా ప్రసంగించారు. ఇప్పుడున్న 95 వేల పీఏసీఎస్‌లలోనూ 63 వేల సంఘాలు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయని, ఇవి కేవలం రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించాయని ఆయన గుర్తుచేశారు. సంఘాల సంఖ్యను పెంచడం ద్వారా రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర, జిల్లా స్థాయి సహకార బ్యాంకుల ఉన్నతాధికారులకు సూచించారు.   నూతన సహకార విధానం తయారీ, ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీపై ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బీఎల్‌ వర్మ, ఆ శాఖ కార్యదర్శి జ్ఞానేశ్‌కుమార్‌, నాఫ్‌స్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎండీ భీమా సుబ్రహ్మణ్యం, ఎన్‌సీయూఐ అధ్యక్షుడు దిలీప్‌ సంఘానీ, క్రిబ్‌కో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌, నాఫెడ్‌ ఛైర్మన్‌ బిజేందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని