ఉపరాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన ఆయన ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి సచివాలయం

Published : 13 Aug 2022 05:53 IST

మాజీ రాష్ట్రపతి కోవింద్‌   దంపతులు కూడా..

దిల్లీ: ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన ఆయన ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి సచివాలయం ట్విటర్‌లో పేర్కొంది. మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆయన సతీమణి సవితా కోవింద్‌, ఇతర కుటుంబ సభ్యులు కూడా ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిశారు.

ధన్‌ఖడ్‌ను కలిసిన ఆసియాన్‌ పార్లమెంటరీ ప్రతినిధుల బృందం: ఆగ్నేయాసియా దేశాల సంఘాని(ఆసియాన్‌)కి చెందిన పార్లమెంటరీ ప్రతినిధుల బృందం శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌తో భేటీ అయింది. కంబోడియా జాతీయ అసెంబ్లీ తొలి ఉపాధ్యక్షుడు, ‘ఆసియాన్‌ ఇంటర్‌-పార్లమెంటరీ అసెంబ్లీ’ కంబోడియా అధ్యక్షుడు కిట్టిసెథబిండిట్‌ చీమ్‌ యీప్‌ నేతృత్వంలో వారు ధన్‌ఖడ్‌ను కలిశారు. భారత ఉపరాష్ట్రపతి హోదాలో తొలి అంతర్జాతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని కలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. ఆసియాన్‌తో సంబంధాలు మొదలైన 30 ఏళ్లలో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఆసియాన్‌ సభ్య దేశాల పార్లమెంటులతో ద్వైపాక్షిక సహకారానికి భారత్‌ అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతియుత, సురక్షిత, సుసంపన్న సంబంధాలను నిర్మించడంలో పార్లమెంటరీ దౌత్య ప్రాధాన్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని