Published : 13 Aug 2022 05:53 IST

ఏనుగుల సంరక్షణలో భారత్‌ అగ్రగామి

కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌

దిల్లీ/ఇడుక్కి: వనరుల కోసం పోటీ వల్లే మనుషులు-ఏనుగుల మధ్య సంఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చెప్పారు. ఫలితంగా దేశంలో ఏటా 500 మంది ప్రజలు (ఏనుగుల దాడుల్లో), 100 గజరాజులు (ప్రజల చేతుల్లో) చనిపోతున్నట్లు తెలిపారు. ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ సందర్భంగా కేరళలోని ఇడుక్కిలో పెరియార్‌ జాతీయ పార్కు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఏనుగుల సంరక్షణలో భారత్‌ అగ్రగామిగా ఉందని, మనుషులు-గజరాజుల మధ్య సంఘర్షణలను తగ్గించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. స్థానికుల సహకారం, భాగస్వామ్యం లేనిదే ఏనుగుల సంరక్షణ చర్యలు విజయవంతం కావని అన్నారు. 2017 లెక్కల ప్రకారం దేశంలో 29,964 ఏనుగులున్నట్లు చెప్పారు. తమిళనాడులో మరో గజరాజుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వీటి సంఖ్య 32కి చేరుతుందన్నారు. ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.

60% ఆసియన్‌ ఏనుగులు భారత్‌లోనే..

ఏనుగుల సంరక్షణకు భారత్‌ నిబద్ధతతో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ‘వరల్డ్‌ ఎలిఫెంట్‌ డే’ సందర్భంగా శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. 60 శాతానికి పైగా ఆసియన్‌ ఏనుగులు భారత్‌లోనే ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో గజరాజుల అభయారణ్యాల సంఖ్య గత ఎనిమిదేళ్లలో పెరిగినట్లు పేర్కొన్నారు. వీటి సంరక్షణకు కృషి చేస్తున్న అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts