Published : 13 Aug 2022 05:53 IST

రూ.150 కోట్లు ఎక్కడివి?

ఉత్తర్‌ప్రదేశ్‌ సంస్థలో లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించిన ఐటీ శాఖ
రూ.15 కోట్ల విలువైన నగదు, నగలు స్వాధీనం

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ సంస్థలో నిర్వహించిన సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రూ.150 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించింది. సివిల్‌ కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు నిర్వహించే ఆ సంస్థకు ఝాన్సీ, లఖ్‌నవూ, కాన్పుర్‌, దిల్లీ, గోవాల్లో ఉన్న 30 ప్రాంగణాల్లో ఈ నెల 3న సోదాలు చేపట్టింది. ఖాతా పుస్తకాల్లో తప్పుడు లెక్కలు నమోదు చేసి లాభాలను తక్కువగా చూపించడం ద్వారా ఈ సంస్థ ఏటా పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ(సీబీడీటీ) శుక్రవారం ప్రకటించింది. సోదాల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.150 కోట్ల ఆదాయానికి సంబంధించిన వివరాలను ఓ కీలక వ్యక్తి స్వచ్ఛందంగా వెల్లడించినట్లు పేర్కొంది. నకిలీ పత్రాలను సృష్టించి వ్యయ్యాన్ని ఎక్కువగా చూపించారని, లేని రుణాలను ఉన్నట్లు చూపించారని సీబీడీటీ వెల్లడించింది. దీనికి సంబంధించి సుమారు రూ.250 కోట్ల మేర అవకతవకలను గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ రూ.15 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని