రాఖీ పండుగకు వెళ్తూ నదిలో పడిన మహిళ

రాఖీ పండుగ కోసం సోదరుడితో పాటు పుట్టింటికి బయలు దేరిన ఓ మహిళ.. నదిలో పడిన 12 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Published : 14 Aug 2022 05:42 IST

12 గంటల తర్వాత సురక్షితంగా బయటకు

భోపాల్‌: రాఖీ పండుగ కోసం సోదరుడితో పాటు పుట్టింటికి బయలు దేరిన ఓ మహిళ.. నదిలో పడిన 12 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రక్షాబంధన్‌ జరుపుకొనేందుకు డాంగి(35) అనే మహిళ గురువారం సాయంత్రం తన సోదరుడితో కలిసి బైకుపై పడారియాలోని తల్లిదండ్రుల వద్దకు బయలుదేరారు. బరిఘాట్‌ వంతెన దాటుతుండగా  వీరి వాహనం ఉబ్బినా బెత్వా నదిలో పడిపోయింది. ప్రవాహం అధికంగా ఉండటంతో 5 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన డాంగి.. నిర్మాణంలో ఉన్న వంతెన ఇనుప చువ్వలను ఆసరాగా పట్టుకుని ఉండిపోయారు. ‘‘నా కుమారుడి కోసం ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని నిశ్చయించుకున్నాను. అందుకే ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నా.. రాత్రంతా వరదలోనే ఉండిపోయాను. ఉదయం అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు తనను రక్షించే క్రమంలో పడవ బోల్తా పడింది. మళ్లీ కొంత దూరం కొట్టుకుపోయాను. లైఫ్‌ జాకెట్‌ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాను’ అని డాంగి వివరించారు. చివరకు తన సోదరుడికి రాఖీ కట్టానని డాంగి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని