Chenab bridge: చీనాబ్‌ రైలుమార్గ వంతెనలో సిద్ధమైన గోల్డెన్‌ జాయింట్‌

ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా నిలిచే జమ్ము-కశ్మీర్‌లోని చీనాబ్‌ వంతెనలో కీలక భాగం సిద్ధమైంది. ‘గోల్డెన్‌ జాయింట్‌’గా పిలిచే ఈ భాగంతో వంతెనలో దాదాపు 98% పనులు పూర్తయినట్లే. చినాబ్‌ నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తున ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదన్న విషయం తెలిసిందే. రూ.1,250 కోట్ల ఖర్చుతో దీనిని

Updated : 14 Aug 2022 09:50 IST

జమ్ము: ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా నిలిచే జమ్ము-కశ్మీర్‌లోని చీనాబ్‌ వంతెనలో కీలక భాగం సిద్ధమైంది. ‘గోల్డెన్‌ జాయింట్‌’గా పిలిచే ఈ భాగంతో వంతెనలో దాదాపు 98% పనులు పూర్తయినట్లే. చినాబ్‌ నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తున ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదన్న విషయం తెలిసిందే. రూ.1,250 కోట్ల ఖర్చుతో దీనిని చేపట్టారు. గోల్డెన్‌ జాయింట్‌ పూర్తయిన సందర్భంగా స్థానికులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు జాతీయ గీతాలు ఆలపిస్తూ, భారత్‌ మాతా కీ జై అనే నినాదాలు చేశారు. కశ్మీర్‌ రైల్వే ప్రాజక్టులోని ఉదంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా మార్గంలో ఈ వంతెన ఉంది. విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం.. వంతెన మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన నిర్మించినట్లు కనిపిస్తున్న ఫొటోను రైల్వేశాఖ ట్విట్టర్‌లో పంచుకుంది. బలమైన గాలులతో పాటు, భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటింది. ప్రస్తుతం కశ్మీర్‌ నుంచి దిల్లీకి సరకు రవాణా చేయడానికి ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts