75 శిఖరాలపై మువ్వన్నెల రెపరెపలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళం అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న 75 పర్వత

Published : 15 Aug 2022 05:26 IST

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళం అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న 75 పర్వత శిఖరాలను ఐటీబీపీ సిబ్బంది అధిరోహించనున్నారు. ‘అమృత్‌రోహణ్‌’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 75 శిఖరాలపైన జాతీయ జెండాలను ఒకేసారి ఎగురవేసి రికార్డు నెలకొల్పనున్నారు.  దీంతోపాటు ఎల్‌ఏసీ వెంబడి ఐటీబీపీ సిబ్బంది 75 రోజులపాటు ప్రత్యేక గస్తీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 1న లద్దాఖ్‌లోని కారాకోరమ్‌ పాస్‌ వద్ద ఇది మొదలైందని, అక్టోబరు 14న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని జచెప్‌ లా వద్ద ముగుస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని