పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం

పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆదివారం ఆమోదముద్ర వేశారు. గత నెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Published : 15 Aug 2022 05:26 IST

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆదివారం ఆమోదముద్ర వేశారు. గత నెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం 13 మంది న్యాయవాదులను ఆ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫార్సు చేయగా రాష్ట్రపతి అందులో 11 పేర్లకు ఆమోదం తెలిపారు. ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట రాష్ట్రపతి వీరి నియామకానికి పచ్చజెండా ఊపినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని