మహాత్ముడి గుర్తుగా.. మెవాత్‌ ఉత్సవం

స్వతంత్ర భారతావనిలోనూ జాతి జాగృతానికి తన బాధ్యతను గాంధీజీ మరవలేదు. ఈ క్రమంలో మియో ముస్లింలనూ కలుసుకున్నారు. స్వయానా వారి గ్రామానికి వెళ్లి మరీ.. పాకిస్థాన్‌ వెళ్లడానికి నిర్ణయించుకున్న వారిని నిలువరించారు. మహాత్ముడు ఇచ్చిన

Published : 15 Aug 2022 06:25 IST

స్వతంత్ర భారతావనిలోనూ జాతి జాగృతానికి తన బాధ్యతను గాంధీజీ మరవలేదు. ఈ క్రమంలో మియో ముస్లింలనూ కలుసుకున్నారు. స్వయానా వారి గ్రామానికి వెళ్లి మరీ.. పాకిస్థాన్‌ వెళ్లడానికి నిర్ణయించుకున్న వారిని నిలువరించారు. మహాత్ముడు ఇచ్చిన భరోసాతో వారూ తమ మనసు మార్చుకున్నారు. ఓ ఆశయంతో తమ గ్రామానికి ప్రత్యేకంగా వచ్చారని.. గాంధీజీ స్మృతిగా ఏటా ‘మెవాత్‌ దినోత్సవం’ నిర్వహించుకుంటున్నారు. మరి.. ఎవరీ మియో ముస్లింలు...? ఏంటా మెవాత్‌ దినోత్సవం కథ...?
ఒకప్పటి రాజ్‌పుత్‌ సామాజికవర్గానికి చెందినవారే ఇప్పటి మియో ముస్లింలు అని చరిత్రకారులు చెబుతారు. సుమారు 12 నుంచి 17 శతాబ్దాల మధ్య రాజ్‌పుత్‌ వంశస్థులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలో చేరారు. అప్పటి నుంచి వారు మియో ముస్లింలుగా కొనసాగుతున్నారు.  స్వాతంత్య్రం అనంతరం వీరు పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహాత్మాగాంధీ 1947డిసెంబరు 19న హరియాణా రాష్ట్రంలోని అప్పటి నుహ్‌ జిల్లా(ఇప్పటి మెవాత్‌ జిల్లా) ఘసేరా గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న మియో ముస్లింలను కలిసి... భారత్‌ను విడిచి వెళ్లొద్దని కోరారు. ఆ తరవాత నలభై రోజులకు.. (1948 జనవరి 30న) గాంధీజీ హత్యకు గురయ్యారు. తమ గ్రామాన్ని సందర్శించి తమకు మద్దతుగా నిలిచిన కొన్ని రోజులకే మహాత్మాగాంధీ మరణించడం వారినెంతో కలచివేసింది. వారిలో కొందరు పాకిస్థాన్‌ తరలివెళ్లగా మరికొందరు మాత్రం ఇక్కడే స్థిరపడిపోయారు. అయితే.. మహాత్మాగాంధీ ఘసేరా గ్రామ సందర్శనను స్మరించుకుంటూ ఆ గ్రామస్థులు 2000 డిసెంబరు 19 నుంచి ‘మెవాత్‌ దినోత్సవం’ నిర్వహించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు