రోదసి అంచున రెపరెపలాడిన జాతీయ జెండా

భారత జాతీయ జెండా భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో రోదసి అంచున రెపరెపలాడింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్‌ కిడ్జ్‌ సంస్థ బెలూన్‌శాట్‌ ద్వారా దీనిని ఆవిష్కరించింది. ఈ సంస్థ తన సోషల్‌ మీడియా వేదికలో సోమవారం ఆ వీడియోని

Published : 16 Aug 2022 05:45 IST

దిల్లీ: భారత జాతీయ జెండా భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో రోదసి అంచున రెపరెపలాడింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్‌ కిడ్జ్‌ సంస్థ బెలూన్‌శాట్‌ ద్వారా దీనిని ఆవిష్కరించింది. ఈ సంస్థ తన సోషల్‌ మీడియా వేదికలో సోమవారం ఆ వీడియోని పోస్టు చేసింది. ‘‘ఈ ఏడాది జనవరి 27న చెన్నై నుంచి బెలూన్‌శాట్‌ని ప్రయోగించాం. ఇది 30 కి.మీ.ల ఎత్తులో అంతరిక్షం అంచున జాతీయ జెండాను ఆవిష్కరించింది’’ అని సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కేసన సోమవారం పీటీఐకి తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వీడియోని విడుదల చేసినట్లు తెలిపారు. స్పేస్‌ కిడ్జ్‌ సంస్థ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 750 మంది బాలికలను ప్రోత్సహించి.. ఆజాదీశాట్‌-1ని రూపొందించింది. ఇందుకోసం రూ.68 లక్షలు ఖర్చు చేసింది. తొలిసారి రూపొందించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ద్వారా ఈ నెల 7న ఆజాదీశాట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. అయితే నిర్దేశిత కక్ష్యలోకి ఆజాదీశాట్‌ని ప్రయోగించడంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థినులు ఏమాత్రం నిరుత్సాహానికి గురికాలేదని, ఆజాదీశాట్‌-2 చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని కేసన తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని