గూగుల్‌.. మువ్వన్నెల పతంగి డూడుల్‌

భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ సోమవారం తన పోర్టల్‌పై డూడుల్‌ను మార్చింది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పతంగుల ఎగురవేతను ఇందులో ఆర్ట్‌ వర్క్‌గా మలిచింది. గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌

Published : 16 Aug 2022 05:45 IST

దిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ సోమవారం తన పోర్టల్‌పై డూడుల్‌ను మార్చింది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పతంగుల ఎగురవేతను ఇందులో ఆర్ట్‌ వర్క్‌గా మలిచింది. గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఇటీవల ప్రారంభించిన ‘ఇండియా కి ఉడాన్‌’ ప్రాజెక్టుకు దీన్ని అనుసంధానించింది. ఓ మహిళ పతంగులను తయారుచేస్తుండగా... బాలబాలికలు వాటిని ఎగురవేస్తున్నట్టు చూపింది. ఇందులో సూర్యుడు, పక్షులు, ఎత్తయిన భవనాలను నేపథ్యంగా చూపింది. దేశ ప్రయాణం ప్రగతి పథాన సాగుతుండటాన్ని ఇతివృత్తంగా తీసుకుని దీన్ని రూపొందించినట్టు కేరళ కళాకారిణి నీతి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని