ఈ ఏడాది రికార్డుస్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం

ఈ ఏడాది రికార్డు స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 138 మందిని నియమించి 2016లో నమోదైన 126 మంది నియామక రికార్డును

Published : 16 Aug 2022 05:45 IST

ఇప్పటి వరకు 138 మంది నియమాకానికి ఆమోదముద్ర

ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది రికార్డు స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 138 మందిని నియమించి 2016లో నమోదైన 126 మంది నియామక రికార్డును అధిగమించినట్లు పేర్కొంది. 2021లో 120 మంది హైకోర్టు, 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొంది. శుక్రవారం ఆరు హైకోర్టులకు 26 మందిని, తాజాగా పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది న్యాయమూర్తుల నియామకంతో రెండు రోజుల్లో 37 మంది కొత్త న్యాయమూర్తులను నియమించినట్లయిందని న్యాయశాఖ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని